Muizzu:15 గంటల పాటు ప్రెస్ మీట్.. మాల్దీవుల అధ్యక్షుడు ప్రపంచ రికార్డ్

by B.Srinivas |

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఏకంగా 15 గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించి రికార్డు నెలకొల్పారు.

Muizzu:15 గంటల పాటు ప్రెస్ మీట్.. మాల్దీవుల అధ్యక్షుడు ప్రపంచ రికార్డ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu ) ఏకంగా 15 గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన 14 గంటల 54 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడినట్టు ముయిజ్జు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అర్ధరాత్రి తర్వాత కూడా సమావేశం కొనసాగిందని గతంలో ఏ అధ్యక్షుడూ ఇంత సుధీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించలేదని పేర్కొంది. జర్నలిస్టుల ప్రశ్నలకు నిరంతరం సమాధానమిచ్చారని వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) రికార్డును ముయిజ్జు అధిగమించారు. గతంలో జెలెన్ స్కీ 14 గంటల పాటు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అంతకుముందు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో 7గంటల పాటు మీడియాతో మాట్లాడారు.

Next Story