- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mufti: భారత్ పాక్‌ల మధ్య చర్చలు జరగాలి.. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న వేళ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) కొనసాగుతున్న వేళ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehabooba Mufthi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్‌లు సంయమనం పాటించాలని కోరారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేయడానికి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఏప్రిల్ 22న పహెల్గంలో జరిగిన విధ్వంసకర దాడి అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రమాదకరంగా మారాయి. రెండు దేశాల దాడుల వల్ల మహిళలు, పిల్లలు, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకం. తీవ్రత పెరిగే కొద్ది మరింత మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే చాన్స్ ఉంది. సైనిక పరిష్కారం విషాదాన్ని మాత్రమే మిగిలిస్తుంది. కాబట్టి ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలను ప్రారంభించాలి’ అని తెలిపారు. నిరంతర ప్రయత్నాల ద్వారా మాత్రమే విద్వేషాలను తగ్గించగలమని పేర్కొన్నారు.






