- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meloni: మోడీ, ట్రంప్ కు ఇటలీ ప్రధాని సపోర్ట్.. ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్ నెట్ వర్క్ పై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్ నెట్ వర్క్ పై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్ డీసీలో కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)ను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. సంప్రదాయ నాయకుల పెరుగుదలపై లిబరల్స్ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. ట్రంప్ (Donald Trump) విజయంతో భయాందోళనలకు గురవుతున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లపై ప్రశంసలు గుప్పించారు. తనను, భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సంప్రదాయవాద నాయకులుగా పేర్కొన్నారు. వారి ఎదుగుదలను ఉదారవాదులు ఓర్వలేకపోతున్నట్లు తెలిపారు.
లిబరల్స్ పై విమర్శలు
90వ దశకంలో బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ మొదలైనవారు గ్లోబల్ లెఫ్టిస్ట్ నెట్‌వర్క్‌ను సృష్టించారని మెలోని గుర్తుచేశారు. అప్పుడు వారిని రాజనీతిజ్ఞులుగా పరిగణించిన లిబరల్స్ ప్రస్తుతం తమను (మోడీ, మెలోని, ట్రంప్) ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వామపక్షాల ద్వంద నీతి అని మండిపడ్డారు. కానీ, ఇకపై ప్రజలు వారి అబద్ధాలను నమ్మబోరన్నారు. లిబరల్స్ తమపై ఎంత బురదజల్లినా ప్రజలు తమకు ఓటు వేస్తూనే ఉంటారన్నారు. అమెరికా అభివృద్ధి విషయంలో ట్రంప్ స్థిరంగా ఉన్నారని.. బయట నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ప్రపంచ దేశాల సంప్రదాయవాదులతో కలిసి ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు.అంతేకాకుండా, అమెరికా- యూరోపియన్ మిత్రదేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల గురించి మెలోనీ ప్రస్తావించారు. అట్లాంటిక్ భాగస్వామ్యం చెక్కుచెదరకుండా ఉందని చెప్పారు. ట్రంప్ పాలనలో అమెరికా, యూరప్ బంధం బలోపేతమయ్యాయని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ సదస్సులో పాల్గొనాలని మెలోనీ నిర్ణయం తీసుకోవడంతో ఇటలీలో రాజకీయ సంచలనం మారిపోయింది. ఆమె దీనికి దూరంగా ఉండాలని ఆ దేశ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు.






