- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం అదే: MP సుమలత కీలక వ్యాఖ్యలు
కర్నాటకలో జేడీఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నానని నటి, మాండ్య ఎంపీ సుమలత తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలో జేడీఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నానని నటి, మాండ్య ఎంపీ సుమలత తెలిపారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తన కుటుంబంపై దాడి చేయించాడని.. అందుకే కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ పతనమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని మోడీ విధానాలు తనకు నచ్చాయని.. కానీ పూర్తి స్థాయిలో బీజేపీలో చేరుతానా లేదా అనేది భవిష్యత్‌లో కాలమే నిర్ణయిస్తుందని ఆమె పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ ఆదరణ లేదని సుమలత అభిప్రాయపడ్డారు. ఇక, మాండ్య పార్లమెంట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత విజయం సాధించిన విషయం తెలిసిందే.
Also Read...
Next Story






