- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జెప్టో, బ్లింకిట్ వల్ల కిరాణా షాపులు మూతపడుతున్నాయి.. రాజ్యసభలో వైసీపీ ఎంపీ
ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్‌లు బ్లింకిట్, జెప్టో లాంటి హైపర్ లోకల్ ఆన్ లైన్ డెలివరీ యాప్ ల వల్ల స్థానిక కిరాణ వ్యాపారులు నష్టపోతున్నారని వైసీపీ ఎంపీ గొల్లబాబు రావు రాజ్యసభలో వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్‌లు బ్లింకిట్, జెప్టో లాంటి హైపర్ లోకల్ ఆన్ లైన్ డెలివరీ యాప్ ల వల్ల స్థానిక కిరాణ వ్యాపారులు నష్టపోతున్నారని వైసీపీ ఎంపీ గొల్లబాబు రావు రాజ్యసభలో వ్యాఖ్యానించారు. కిరాణా వ్యాపారులను కేంద్రం ఆదుకోవాలని అన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ డెలివరీ కారణంగా లక్షలాది కిరాణా దుకాణాలు మూతపడ్డాయని చెప్పారు. పది నిమిషాల్లోనే డెలివరీ, ఆఫర్ల పేరుతో ఆనైన్ యాప్ తో కిరాణా వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారని చెప్పారు. గతేడాది కనీసం 2 లక్షల దుకాణాలు మూతపడ్డాయన్నారు.
అంతేకాకుండా స్థానికంగా వ్యాపారం ఘననీయంగా తగ్గిపోయిందని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే బ్లింకిట్, జెప్టోతో పాటు పలు ఆన్ లైన్ యాప్ లు ఇప్పటికే నగరాల్లో పదినిమిషాలలో కిరాణా వస్తువులు డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. కిరాణా వస్తులు మాత్రమే కాకుండా కూరగాయలు సైతం డెలివరీ చేస్తున్నాయి. దీంతో కిరాణా వ్యాపారులతో పాటు కూరగాయలు అమ్మే వాళ్లు సైతం వ్యాపారం లేక ఇబ్బందిపడుతున్నారు. త్వరలో గ్రామాలకు సైతం ఆన్ సేవలు విస్తరించే అవకాశం ఉండటంతో గ్రామాల్లోని వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు.






