MP ELECTION RESULT 2024 : ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత..

by Sathputhe Rajesh |   (  Updated:2024-06-04 03:23:42  IST  )

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచీ బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది.

MP ELECTION RESULT 2024 : ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత..
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచీ బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. హిందీ బెల్టులో బీజేపీ తన ఆధిక్యతను కనబర్చుకున్నది. తూర్పు, ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాల్లోనూ కమలం పార్టీయే ఆధిక్యంలో ఉన్నది. పోస్టల్ బ్యాలెట్లలో సైతం ఎన్డీఏ కూటమి ఎక్కువ ఓట్లు సాధించింది. కానీ దక్షిణాదిలో మాత్రం ఇండియా కూటమి తన సత్తాను నిలుపుకుంటున్నది. రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థికంటే అడ్వాన్సులో ఉన్నారు. రాయ్‌బరేలిలో సైతం బీజేపీతో గట్టిగానే తలఫడుతున్నారు. అక్కడ కూడా అడ్వాన్సులో ఉన్నారు. తమిళనాడులో డీఎంకే మరే ఇతర పార్టీకంటే అడ్వాన్సులో ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తన ఆధిక్యతను కనబరుస్తున్నది. కానీ మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ నెలకొన్నది.

కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ కూటమి ఫార్ములా సారి వర్కవుట్ అవుతున్నదని తొలి రౌండ్లలోని ఓట్ల లెక్కింపుతో స్పష్టమవుతున్నది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌కు చెందిన ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఆధిక్యంలోనే ఉన్నారు. జేడీఎస్ తరఫున మాండ్యాలో పోటీచేస్తున్న కుమారస్వామి మిగిలిన పార్టీలకంటే ఆధిక్యంలో ఉన్నారు. హర్యానాలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగినా అక్కడి స్థానిక పరిస్థితుల కారణంగా బీజేపీ వెనకబడింది. కాంగ్రెస్ అడ్వాన్సులో ఉన్నట్లు తొలి రౌండ్ల కౌంటింగ్‌లో స్పష్టమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ అధ్యక్షుడు పోటీ చేస్తున్న కన్నౌజ్‌లో బీజేపీ కంటే ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో గతంలో తరహాలోనే ఈసారి కూడా బీజేపీ ముందంజలో ఉన్నది.

Next Story