- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కసారిగి విరిగిపడ్డ కొండ చరియలు.. తృటిలో తప్పించుకున్న ఎంపీ
భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఎంపీ అనిల్ బలూనీ విరిగిపడిన కొండ చరియలు నుంచి తృటిలో తప్పించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఎంపీ అనిల్ బలూనీ (BJP MP MP Anil Baluni) విరిగిపడిన కొండ చరియల నుంచి తృటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ (Uttarakhand) గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్ (Land slide) ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే దేవప్రయాగ్ డిగ్రీ కళాశాల సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో.. ఆ ప్రాంతాన్ని సమీక్షించేందుకు గర్వాల్ ఎంపీ అనిల్ బలూనీ, దేవప్రయాగ్ ముల వినోద్ కందారి అక్కడకు వెళ్లారు.
అయితే కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాన్ని ఎంపీ అనిల్ బలూనీ అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్న సమయంలో.. ఎవరూ ఉహించని విధంగా మరోసారి పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన అధికారులు, ఎంపీ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అనిల్ బలూనీ, అధికారులకు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అనంతరం అధికారులు ఎంపీ అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది.






