- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Movie Ticket: సినిమా టికెట్ ధర రూ.200 మాత్రమే.. కర్ణాటకలో కొత్త రూల్
by B.Srinivas |
సినిమా టికెట్ ధరలను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: సినిమా టికెట్ ధరలను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సినిమాస్ రెగ్యులేషన్ రూల్స్-2025 ముసాయిదాను జారీ చేసింది. కర్ణాటక సినిమాల నియంత్రణ చట్టం, 1964 ఆధారంగా కొత్త నియమాలను రూపొందించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని మల్టీ ప్లెక్స్ సహా అన్ని సినిమా హాళ్లలో టికెట్ ధర రూ.200 మించొద్దు. వినోదపు పన్ను సైతం అందులోనే ఉంటుంది. 15 రోజుల వరకు ఈ డిసిషన్‌పై అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయాలని పేర్కొంది. అనంతరం దీనిపై సమీక్షించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. సినిమాను సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడంతో పాటు మల్టీప్లెక్స్‌ల అధిక ధరలను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Next Story






