- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియా ప్రజలను మౌంట్ ఇబు అగ్నిపర్వతం తీవ్రంగా వణికిస్తోంది. సెగలు కక్కుతూ లావా విరజిమ్ముతోంది. కేవలం 20 రోజుల్లోనే 1000 సార్లు విస్పోటనం చెందింది. ఈక్రమంలో దీని తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరుగొచ్చని వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్వతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ప్రభుత్వం తరలించే ప్రయత్నాలు చేపట్టింది. నార్త్ మలుకు ప్రావిన్స్‌లోని హల్మహేరా ద్వీపంలోని మౌంట్ ఇబు ఈ ఏడాది ప్రారంభం నుంచి విస్ఫోటం చెందుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ అగ్నిపర్వతం నుంచి గాలిలోకి 0.3 కి.మీ. నుంచి 4 కి.మీ. వరకు బూడిద ఎగసిపడింది.
తాజాగా ఆదివారం 1.5 కి.మీ. మేర బూడిద కనిపించింది. అలాగే మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు బద్ధలైన శబ్దం వినిపించిందని ఇండోనేసియా జియోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ అగ్నిపర్వతం ఒక్క ఆదివారమే 17 సార్లు బద్ధలైందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఆరు గ్రామాల్లో నివసించే 3000 మంది గ్రామస్థులకు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందుకు పలువురు గ్రామస్థులు నిరాకరిస్తున్నారు. తమ పంటలను మధ్యలో వదిలి వచ్చేయడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. దీంతో అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేపట్టారు. ఇక ఇండోనేషియాలో మౌంట్ ఇబు అత్యంత యాక్టివ్ అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది గత ఏడాది ఏకంగా 2 వేల సార్లు బద్ధలైంది.






