Mount Etna Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు తీసిన పర్యటకులు

by Muthe.Rajitha |

ఇటలీ(Italy)లోని సిసిలీ దీవి(Sicily Iceland)లో కాటానియా నగరం సమీపంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం(Mount Etna Volcano) నేడు బద్దలైంది.

Mount Etna Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు తీసిన పర్యటకులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటలీ(Italy)లోని సిసిలీ దీవి(Sicily Iceland)లో కాటానియా నగరం సమీపంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం(Mount Etna Volcano) నేడు బద్దలైంది. ఇది యూరప్‌లో ఉన్న అత్యంత యాక్టివ్ అగ్నిపర్వతాల్లో ఒకటి. ఒక్కసారిగా అగ్ని పర్వతం బద్దలై, ఆకాశంలోకి భారీగా బూడిద, పొగలు, లావా రాళ్లు ఎగిరి పడటంతో సమీపంలోని ప్రజలు, పర్యటకులు భయంతో పరుగులు తీశారు. బూడిద మేఘాలు ఆకాశంలో 6,400 మీటర్ల ఎత్తుకు ఎగసిపడగా.. 300 మీటర్ల ఎత్తువరకు రాళ్ళు ఎగిరి పడ్డాయి. ఈ వల్కనో పేలుడు వలన కాటానియా విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిపివేశారు.

ఇటలీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ(INGV) ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. సమీప గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ అగ్నిపర్వతం గత ఫిబ్రవరిలో కూడా బద్దలవడంతో స్థానికులు, పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఈ సంవత్సరం ఇప్పటికే 3 సార్లు బద్దలైన ఈ 3,369 మీటర్ల ఎత్తైన అగ్నిపర్వతం.. 1500 BC నుంచి 200 సార్లు విస్ఫోటనాలతో ప్రపంచంలోనే అత్యంత చురుకైనదిగా పేరు పొందింది.

Next Story