గత కొన్ని రోజులుగా కూతురిని వేధిస్తున్న పోకిరి.. బుద్ధి చెప్పిన తల్లి(వీడియో వైరల్)

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-12 13:42:46  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

గత కొన్ని రోజులుగా కూతురిని వేధిస్తున్న పోకిరి.. బుద్ధి చెప్పిన తల్లి(వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బాలికను గత కొన్ని రోజుల నుంచి లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూపీ(Uttar pradesh)లోని హమీర్‌పూర్‌లో తన కూతురిపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరి పై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో ఆ వ్యక్తిని 9 సెకండ్లలో 15 సార్లు చెప్పుతో కొట్టి బహిరంగంగా బుద్ధి చెప్పింది. అతను వదిలేయాలని వేడుకున్నప్పటికీ ఆ మహిళ వదలలేదు. కొడుతూనే ఉంది. దీంతో అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా(Social Media))లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది. అయితే ఆ మహిళ నుంచి ఫిర్యాదు రాకపోయినా వీడియో ఆధారంగా ఆ యువకుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

https://x.com/bstvlive/status/1921799312578683315

Next Story