తిరువళ్లూరులో దారుణం.. పిల్లల ఒళ్లంతా కాల్చిన తల్లి

by Naga Rani Yarlagadda |

సమాజంలో రోజురోజుకూ మానవత్వమే కాదు.. అమ్మతనం కూడా కనుమరుగైపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమ్మప్రేమను మించింది మరొకటి లేదంటారు.

తిరువళ్లూరులో దారుణం.. పిల్లల ఒళ్లంతా కాల్చిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకూ మానవత్వమే కాదు.. అమ్మతనం కూడా కనుమరుగైపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమ్మప్రేమను మించింది మరొకటి లేదంటారు. కానీ.. కొందరు తల్లులు చేస్తున్న దాష్టీకాలు చూస్తుంటే అమ్మ ప్రేమలోనూ కల్తీ, విషం ఉంటాయా అన్న సందేహాలు రావడం ఖాయం. పిల్లలు మాట వినకపోతే ఏ తల్లైనా ఒకటి, రెండు దెబ్బలు వేయడం సహజం. కానీ.. ఓ తల్లి తన పిల్లల ఒళ్లంతా కాల్చి అమ్మతనానికే తలఒంపులు తెచ్చింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో జరిగింది.

రెండో భర్త మాట విన్న సంధ్య.. మాట వినడం లేదని పిల్లలకు నిత్యం నరకం చూపించింది. వారి ఒళ్లంతా కాల్చడంతో తీవ్రగాయాలయ్యాయి. పిల్లల ఏడుపులు, అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడు వెళ్లిన పోలీసులు తల్లి సంధ్య, మారు తండ్రిని అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన పిల్లలిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Next Story