- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్.. ఢిల్లీలో అదుపులోకి!
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుమానిత ఉగ్రవాది మహ్మద్ షానవాజ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుమానిత ఉగ్రవాది మహ్మద్ షానవాజ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. సోమవారం ఢిల్లీ స్పెషల్ పోలీస్ టీమ్ ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. షానవాజ్ తలపై రూ.3 లక్షల రివార్డు ఉంది. ఇంజినీర్ అయిన షానవాజ్ తన గుర్తింపును దాచుతూ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. ఇతడి కోసం పక్కాగా ప్లాన్ చేసిన పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఉగ్రవాద లింకులకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు కలిగిన వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. ఎన్ఐఏతో కలిసి పని చేస్తోంది.
Next Story






