- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kashmir : ఈ సీజన్‌లోనే తొలిసారిగా కశ్మీరులో కురిసిన మంచు
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : ఈ చలికాలం సీజన్‌లో తొలిసారిగా భూలోక స్వర్గం కశ్మీరులో(Kashmir) మంచు కురిసింది.

X
దిశ, నేషనల్ బ్యూరో : ఈ చలికాలం సీజన్‌లో తొలిసారిగా భూలోక స్వర్గం కశ్మీరులో(Kashmir) మంచు కురిసింది. కశ్మీరు పరిధిలోని మైదాన ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురవగా, కొండ ప్రాంతాల్లో పలుచోట్ల మంచు పడింది. గుల్మార్గ్‌లోని అఫ్పర్వాత్ పర్వత శిఖరం (బారాముల్లా జిల్లా), సాధ్నా టాప్ (కుప్వారా జిల్లా) ఏరియాలలో తేలికపాటి మంచు(Snowfall) కురిసింది. కశ్మీరులోని శ్రీనగర్ సహా వివిధ మైదాన ప్రాంతాలను సోమవారం మధ్యాహ్నం వరుణుడు చిరు జల్లులతో పలకరించాడు. ఒకేరోజులో రెండు భిన్నరకాల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీరులో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.
Next Story






