Monsoon: మళ్లీ యాక్టివ్‌గా నైరుతి రుతుపవనాలు.. ముంచెత్తనున్న వర్షాలు !

by B.Srinivas |

గత 15 రోజులుగా నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నట్టు భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు

Monsoon: మళ్లీ యాక్టివ్‌గా నైరుతి రుతుపవనాలు.. ముంచెత్తనున్న వర్షాలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: గత 15 రోజులుగా నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నట్టు భారత వాతావరణ శాఖ (IMD) సీనియర్ అధికారులు తెలిపారు. దీంతో ఈ వారం రోజుల్లో మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతాయని, వేడి గాలుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. బంగాళాఖాతంలో అనుకూలమైన వాతావరణం ఉండటంతో నైరుతి రుతుపవనాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. రుతుపవనాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించాయని తెలిపారు. కాగా, గడువు కన్నా ముందే రుతుపవనాలు మే నెల 24న కేరళ తీరాన్ని తాకాయి. అదే నెల 29 నుంచి రుతుపవనాల పురోగతి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఊపందుకున్నాయని ఐఎండీ తెలిపింది.

ముంబై జలమయం

మహారాష్ట్రలోని ముంబై, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రైలు, మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. గత 24 గంటల్లో ముంబైలో సగటున 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 1 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 18 మంది మరణించగా, 65 మంది గాయపడ్డారని తెలిపారు.

Next Story