- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోట్ల వర్షం కురిపించిన కోతి.. బ్యాగ్ కొట్టేసి.. చెట్టెక్కి రూ.2 లక్షలు గాల్లోకి విసిరేసి హల్‌చల్
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చెట్టుపై నుంచి అకస్మాత్తుగా నోట్ల వర్షం కురిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చెట్టుపై నుంచి అకస్మాత్తుగా నోట్ల వర్షం కురిసింది. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చోటుచేసుకున్న ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం ఓ వ్యక్తి రూ.2 లక్షల నగదు (రూ.500 నోట్ల కట్టలు) ఉన్న బ్యాగ్‌తో కోర్టు ఆవరణలోని ఒక న్యాయవాది కార్యాలయానికి వచ్చాడు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఓ కోతి, ఆ వ్యక్తి చేతిలోని బ్యాగ్‌ను లాక్కుని సమీపంలోని చెట్టెక్కింది. అందులో తినే వస్తువులు ఉన్నాయేమోనని బ్యాగ్ తెరిచిన కోతికి నోట్ల కట్టలు కనిపించాయి. వాటిని తీసుకున్న కోతి ఒక్కొక్కటిగా గాల్లోకి విసిరేయడం ప్రారంభించింది. దీంతో చెట్టు పైనుంచి కరెన్సీ నోట్ల వర్షం కురుస్తున్నట్లు కనిపించింది.
ఈ దృశ్యాన్ని చూసిన జనం నోట్లు ఏరుకోవడానికి పెద్ద ఎత్తున గుమికూడారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, వెంటనే అప్రమత్తమైన బ్యాగ్ యజమాని స్థానికుల సహాయంతో కిందపడిన నోట్లను ఏరుకున్నాడు. అదృష్టవశాత్తూ, మొత్తం రూ.2 లక్షలకు గాను రూ.1.98 లక్షల నగదును అతను సురక్షితంగా వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.






