- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంభమేళా మోనాలిసా కేసులో షాకింగ్ ట్విస్ట్.. అరెస్టుపై కోర్టు స్టే
కుంభమేళా మోనాలిసా పెళ్లి కేసులో షాకింగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఉన్నట్లు కొచ్చిపోలీసులు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన మోనాలిసా భోంస్లే వివాహ వ్యవహారం ఇప్పుడు అంతర్రాష్ట్ర పోలీసుల దర్యాప్తుకు దారితీసింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని కేరళలోని కొచ్చి పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులకు అధికారికంగా తెలియజేసినట్లు కొచ్చి కమిషనర్ కార్యాలయం పేర్కొంది. ఈ కేసులో జాతీయ గిరిజన కమిషన్ (NCST) జోక్యంతో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. వివాహం జరిగే నాటికి మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలలు మాత్రమేనని కమిషన్ నిర్ధారించింది. పెళ్లి కోసం ఆమె నకిలీ బర్త్ సర్టిఫికెట్ ను ఉపయోగించినట్లు విచారణలో తేలింది. మధ్యప్రదేశ్ ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె పుట్టిన తేదీ 30 డిసెంబర్ 2009గా నమోదై ఉంది.
భర్తపై పోక్సో కేసు
ఆమె మైనర్ అని తేలడంతో.. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసుల బృందం కేరళలో మోనాలిసా కోసం గాలిస్తోంది. ఆమె ఆచూకీ లభిస్తే ముందుగా వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ కేసు దర్యాప్తులో జాప్యంపై జాతీయ గిరిజన కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలు ఢిల్లీలో తమ ఎదుట హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. ఒకవైపు కోర్టు రక్షణ, మరోవైపు పోక్సో చట్టం కింద దర్యాప్తు ఉండటంతో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.






