పెద్దలు ఒప్పుకోవడంలేదు.. ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‍కు మోనాలిసా

by Prasad Jukanti |

కుంభమేళాలో వైరల్ అయిన మొనాలీసా భోంస్లే తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో పెళ్లి కోసం కేరళ పోలీసులను ఆశ్రయించింది.

పెద్దలు ఒప్పుకోవడంలేదు.. ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‍కు మోనాలిసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియుడితో పెళ్లి కోసం పోలీసులను ఆశ్రయించింది. తన పెళ్లికి మా పెద్దలు అంగీకరించడం లేదని మీరే మా జంటకు రక్షణ కల్పించాలని తాజాగా తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోనాలిసా తన ప్రియుడితో కలిసి ఉదయం స్టేషన్‌కు చేరుకుని తన తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఆయనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

ఫేస్ బుక్ ఫ్రెండ్ తో లవ్:

కాగా మోనాలిసా ఏడాదిన్నరగా ఫేస్‍బుక్‍లో పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. వీరి ప్రేమను ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో ఇవాళ ఉదయం పోలీసులను ఆశ్రయించిన ఈ జంట తమకు రక్షణ కల్పించాలని కోరింది. మోనాలిసా ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసుల జోక్యం కోరుకుందని తెలిపారు. మేము ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్‍కు చెందిన మోమాలిసా భౌన్స్లే పూసలు అమ్ముకునేందుకు తన కుటుంబంతో పాటు 2025 మహా కుంభమేళకు వచ్చింది. ఆ సమయంలో మోనాలిసా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ దెబ్బకు ఆమెకు సినిమా ఆవకాశాలు సైతం వచ్చాయి. ప్రొడ్యూసర్ సరోజ్ మిశ్రా'ది డైరీ ఆఫ్ మణిపూర్' చిత్రంలో ఆమెకు ఒక పాత్రకు అవకాశం ఇచ్చారు. అలాగే మోనాలిసాకు నటనలో శిక్షణ కూడా ఇప్పించారు. ఆ తర్వాత మోనాలిసా మలయాళంలో నాగమ్మ అనే మూవీలో నటించింది. దీనిని పి బిను వర్గీస్ దర్శకత్వం వహించి జీలి జార్జ్ నిర్మించారు. టాలీవుడ్ లో తెలుగులోనూ చాన్స్ కొట్టేసింది. తెలుగులా మోనాలిసా హీరోయిన్‍గా సాయి చరణ్ హీరోగా 'లైఫ్' అనే మూవీ షూటింగ్ కొద్దినెలల క్రితమే ప్రారంభమైంది.

Next Story