- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు.. రూ.2 కోట్లకు పైగా రివార్డు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసుల ఎదుట (Maoists Surrender) లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసుల ఎదుట (Maoists Surrender) లొంగిపోయారు. నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో మొత్తం 51 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి లొంగిపోయినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2024 నుంచి ఇప్పటి వరకూ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లలో 185 మంది మావోలు హతమయ్యారని వెల్లడించారు. మరో 803 మంది అరెస్ట్ అవ్వగా.. 431 మంది లొంగిపోయారని తెలిపారు.
బీజాపూర్ జిల్లా బస్తర్ ఐజీ (Bastar IG Sunder) ఎదుట 25 మంది లొంగిపోగా.. వారిపై రూ.1.15 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అలాగే కాంకేర్ జిల్లా ఎస్పీ కల్యాణ్ (SP Kalyan) ఎదుట 13 మంది లొంగిపోగా.. వారిపై రూ.62 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. సుక్మా ఎస్పీ కిరణ్ జవాన్ (Sukhma SP Kiran Jawan) ఎదుట ఐదుగురు లొంగిపోగా.. వారిపై రూ.6 లక్షల రివార్డున్నట్లు చెప్పారు. ఇక నారాయణపూర్ ఎస్పీ రాబిన్ సన్ గుడియా ఎదుట నలుగురు మహిళా మవోయిస్టులు సహా.. 8 మంది లొంగిపోగా వారిలో కమాండర్ కమలేష్ కూడా ఉన్నారని ఎస్పీ వివరించారు. వారందరిపై రూ.33 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు.






