హిందువులు లేని రోజు ప్రపంచం అంతమైపోతుంది.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-22 05:23:17  IST  )

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుందని అన్నారు. హిందువులు లేని రోజు ప్రపంచం అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచించాలని చెప్పారు.

హిందువులు లేని రోజు ప్రపంచం అంతమైపోతుంది.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుందని అన్నారు. హిందువులు లేని రోజు ప్రపంచం అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచించాలని చెప్పారు. పరిస్థితులు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు. యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమా దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. కానీ మన భారతదేశ నాగరికత అమరమైందని వ్యాఖ్యానించారు.

భారత నాగరికత ఇప్పటి వరకు నిలిచింది భవిష్యత్ లోనూ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే భారత సమాజంలో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల హిందూసమాజం ఉండితీరుతుందని హిందూ సమాజం లేని రోజు ప్రపంచమే ఉండదని వ్యాఖ్యానించారు. సమాజానికి ఏం కావాలో దాన్ని హిందూ సమాజమే సాధించి ఇవ్వగలుగుతుందని అన్నారు. అది ఈశ్వరుడి కర్తవ్యం అని వ్యాఖ్యానించారు. ఓ సమావేశంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Next Story