- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RSS పారామిలిటరీ సంస్థ కాదు.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యూనిఫాం వేసుకుని కవాతు చేస్తూ శారీరక వ్యాయామాలు చేసినపప్పటికీ ఆర్ఎస్ఎస్ పారా మిలటరీ సంస్థ కాదని అన్నారు. సంఘ్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్థ అని అర్థం చేసుకోవాలన్నారు.

దిశ, వెబ్ డెస్క్: యూనిఫాం వేసుకుని కవాతు చేస్తూ శారీరక వ్యాయామాలు చేసినపప్పటికీ ఆర్ఎస్ఎస్ పారా మిలటరీ సంస్థ కాదని అన్నారు. సంఘ్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్థ అని అర్థం చేసుకోవాలన్నారు. భారతదేశం మళ్లీ విదేశీ శక్తి కోరల్లో చిక్కుకోకుండా చూసుకోవడానికి, సమాజాన్ని ఏకం చేయడానికి అవసరమైన లక్షణాలు, సద్గుణాలతో నింపడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తుందని చెప్పారు. అంతే కాకుండా బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవాలని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ జనసంఘ్ మరియు దాని వారసుడు, పాలక బీజేపీకి మాతృసంస్థగా విస్తృతంగా పరిగణించబుతుందని చెప్పారు. సంఘ్ కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాపిస్తోందని ఆవేదనవ వ్యక్తం చేశారు. ప్రజలు ఈ రోజుల్లో సరైన సమాచారాన్ని సేకరించడానికి లోతుగా వెళ్లడం లేదని తెలిపారు. మూలాలను తెలుసుకోవడం లేదని కేవలం వికిపీడియాను చదువుతున్నారని అన్నారు. అక్కడ ఉన్న ప్రతి విషయం నిజం కాదని లోతుగా పరిశీలించినవారికి అసలు విషయం తెలుస్తుందని చెప్పారు.






