- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mohalla Clinics: మొహల్లా క్లినిక్‌లలో భారీ అవినీతి.. ఆప్‌పై బీజేపీ విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిర్వహించిన మొహల్లా క్లినిక్స్‌లో భారీ అవినీతి జరిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేశా ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మొహల్లా క్లినిక్స్‌లో భారీ అవినీతి జరిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా (Veerendra Sachdeva) ఆరోపించారు. ప్రభుత్వ నిధులను ఆప్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఫైర్ అయ్యారు. మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉచిత ఆరోగ్య సంరక్షణ పేరుతో అవినీతి దుకాణాలు నడిపారని విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మొహల్లా క్లినిక్‌లను బీజేపీ మూసి వేస్తోందని ఆప్ నిరంతరం ఆరోపిస్తోందనిచ కానీ మేము వారి దుకాణాలకు మూసివేస్తున్నామని తెలిపారు.
2023 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు రెండు క్లినిక్‌ల ద్వారా రూ.4.63 కోట్లు సంపాదించడానికి ప్రయత్నం జరిగిందన్నారు. మొహల్లా క్లినిక్‌లలో కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి అయినప్పటికీ, ఎటువంటి ఫోన్ నంబర్లు రికార్డ్ చేయకుండా 12,457 పరీక్షలు నిర్వహించారని ఆరోపించారు. అవినీతిపై దర్యాప్తు చేస్తుంటే ఆప్ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. కాగా, మొహల్లా క్లినిక్‌లను మూసివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సచ్ దేవా స్పందించారు.






