Pastor Bajinder Singh: యేషు యేషు పాస్టర్ కు జీవిత ఖైదు

by Shamantha N |

ప్రముఖ మతబోధకుడు, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌ బాజిందర్‌ సింగ్‌ (Bajinder Singh)కు రేప్ కేసులో జీవిత ఖైదు పడింది.

Pastor Bajinder Singh: యేషు యేషు పాస్టర్ కు జీవిత ఖైదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ మతబోధకుడు, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌ బాజిందర్‌ సింగ్‌ (Bajinder Singh)కు రేప్ కేసులో జీవిత ఖైదు పడింది. యేషు, యేషు పాస్టర్ గా ప్రసిద్ధి చెందిన బాజిందర్ సింగ్ 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా.. ఈ కేసులో ఆయన్ని దోషిగా తేల్చిన మొహాలీ కోర్టు.. ప్రస్తుతం జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు (Rape Case)లో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. ఇకపోతే, బాజిందర్‌ సింగ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జిరాక్‌పుర్‌కు చెందిన ఓ మహిళ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు తీసుకెళ్తానని ఆశపెట్టి తనని హోటల్ గదికి పిలిచినట్లు బాధితురాలు పేర్కొంది. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ దృశ్యాలను రికార్డ్‌ చేశాడని ఆరోపించింది. అతడి డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటీవలే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపిన కోర్టు.. అతడిని దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది.

యేషు యేషు పాస్టర్ గా ఫేం

హర్యానాకు చెందిన బాజిందర్‌ సింగ్‌ ఓ జాట్‌ కుటుంబంలో జన్మించాడు. 2012లో మతబోధకుడిగా మారాడు. జలంధర్‌, మొహాలిలలో ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశాడు. తక్కువ టైంలోనే పాపులర్‌ అయిన సింగ్‌కు సోషల్‌ మీడియాలోనూ లక్షలాది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఇతడిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెకు నయం చేస్తానని డబ్బులు తీసుకున్నట్లు ఢిల్లీకి చెందిన దంపతులు 2022లో కేసు పెట్టారు. 2023లో సింగ్‌పై ఆదాయపు పన్ను సోదాలు కూడా చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కపుర్తలాకు చెందిన మరో యువతి అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.

Next Story