Modi - Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు మోడీ అప్యాయ పలకరింపు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-20 10:28:43  IST  )

ఏపీ(AP) డిప్యూటీ సీఎం(Deputy CM), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పట్ల ప్రధాని మోడీ(Prime Minister Modi)కి ఉన్న ప్రేమ వారిద్ధరు ఎదురుపడిన ప్రతిసారి వ్యక్తమవుతునే ఉంది.

Modi - Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు మోడీ అప్యాయ పలకరింపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) డిప్యూటీ సీఎం(Deputy CM), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పట్ల ప్రధాని మోడీ(Prime Minister Modi)కి ఉన్న ప్రేమ వారిద్ధరు ఎదురుపడిన ప్రతిసారి వ్యక్తమవుతునే ఉంది. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణాస్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వేదికపై ఆహ్వానితులకు పరస్పర అభివాదం చేసే క్రమంలో పవన్ కల్యాణ్ వద్ధకు వెళ్లారు.

పవన్ చేతిలో చేయి వేసిన ప్రధాని మోడీ అప్యాయంగా పలకరించారు. పవన్ ఎలా ఉన్నావ్..? అని..తను ధరించిన దీక్షా మాల ఏ దేవుడి మాల అని..? : ప్రధాని మోడీ ఆసక్తిగా అడిగారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబును కూడా ప్రధాని మోడీ చేతిలో చెయ్యివేసి ఆప్యాయంగా పలకరించారు. వేదికపై ఉన్న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, జేపీ నడ్డా సహా పలు రాష్ట్రాల సీఎంలను, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష ముఖ్య నేతలను ప్రధాని మర్యాదపూర్వకంగా పలకరించి అభివాదం చేశారు.

కాగా తనతో వేదికపై ప్రధాని మోడీ మాట్లాడిన మాటలను పవన్ కల్యాణ్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. హిమాలయాలకు వెళ్లిపోతావా..? అని ప్రధాని మోడీ సరదాగా అన్నారని..అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నావా అని.. అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని, నువ్వు చేయాల్సిన పని చేయ్ అని మోడీ చెప్పినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఢిల్లీ ఎన్నికల విజయం చారిత్రాత్మకమని.. ప్రధాని మోడీ నాయకత్వం, ఎన్డీఏ పాలన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అభివర్ణించారు.

గతంలో పవన్ ను తుఫాన్ తో పోల్చి ప్రశంసించిన ప్రధాని మోడీ పార్లమెంటు ఎన్నికల్లో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం పిదప పవన్ కు మరింత ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ తో పాటు చంద్రబాబు ప్రచారం బీజేపీకి విజయానికి దోహదం చేసింది. సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో పవన్ కల్యాణ్ చేస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో దక్షిణాన బీజేపీ సైద్దాంతిక విస్తరణకు, రాజకీయ అవసరాలకు ఆయనను ఆ పార్టీ కీలకంగా భావిస్తుంది.

Next Story