- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 23-29 లో న్యూయార్క్‌లో జరిగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)హై-లెవెల్ జనరల్ డిబేట్‌కు హాజరు కాకపోవచ్చని సమాచారం. ఇటీవల అమెరికాతో తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా భారత్ పై అమెరికా విధించిన 50% టారిఫ్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ పర్యటన రద్దుపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ఈనెల 26న UN జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోడీ స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ భారతదేశం తరపున ప్రసంగించనున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి మోడీ అమెరికా పర్యటన రద్దు అయిందని వినిపిస్తోంది. మరోవైపు అమెరికా అధిక టారిఫ్ ల నేపథ్యంలో భారత్ రష్యా, చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకుంటూ.. అమెరికాను దూరం పెడుతున్నట్టు సిగ్నల్స్ ఇస్తోంది.
Next Story






