ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రసంగాలు అర్థరహితం.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

by Kema Shiva Kumar |

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రసంగాలు అన్నీ అర్థరహితమని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రసంగాలు అర్థరహితం.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రసంగాలు అన్నీ అర్థరహితమని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా.. దేశంలో నిరుద్యోగం, ప్రజల స్థితిగతులపై సంచలన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి విచ్ఛినమైందని కామెంట్ చేశారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది.. ఒకవేళ ఉద్యోగులు వచ్చినా చాలా తక్కువ వేతనలు ఉన్నాయని కామెంట్ చేశారు. దేశంలో 29 ఏళ్ల లోపు వయసు ఉన్న నిరుద్యోగులు 19 శాతానికి పెరిగారని అన్నారు. అదేవిధంగా 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగులు 44.5 శాతంగా ఉన్నారని తెలిపారు. దేశంలో 54.8శాతం పట్టభద్రులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని కామెంట్ చేశారు. దేశంలో వేతన జీవులు 2006లో 9.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 0.1 శాతానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల సేవింగ్స్ 18.1 శాతానికి పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని.. ప్రజల పొదుపు తగ్గి అప్పులు పెరిగాయని మల్లికార్జున ఖర్గే కామెంట్ చేశారు.

Next Story