- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటలీ పర్యటనలో మోడీ 'స్వీట్' సర్ప్రైజ్.. మెలోనికి 'మెలోడి' చాక్లెట్ గిఫ్ట్
భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ బంధం (డిప్లొమాటిక్ కెమిస్ట్రీ) గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ బంధం (డిప్లొమాటిక్ కెమిస్ట్రీ) గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వినియోగదారులు వీరిద్దరి పేర్లను కలిపి ‘#Melodi’ (మెలోడి) అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తుంటారు. తాజాగా వీరి స్నేహానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన ఉదంతం ఇరు దేశాల దౌత్య వర్గాల్లో మరియు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ద్వైపాక్షిక చర్చల నిమిత్తం ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఒక ఊహించని, అత్యంత ప్రత్యేకమైన కానుకను అందించారు. భారతదేశంలో దశాబ్దాలుగా ఎంతో ప్రసిద్ధి చెందిన 'పార్లేస్ మెలోడి' (Parle's Melody) చాక్లెట్ ప్యాకెటు ఆయన ఆమెకు బహుమతిగా ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపై నడుస్తున్న ‘మెలోడి' ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ ఈ సరదా కానుకను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
థాంక్యూ చెప్పిన మెలోని..
ప్రధాని మోడీ ఇచ్చిన ఈ స్వీట్ సర్ప్రైజ్కు జార్జియా మెలోని ఎంతగానో మురిసిపోయారు. ఈ సరదా క్షణానికి సంబంధించిన వీడియోను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. చాక్లెట్ ప్యాకెట్ అందుకున్న సమయంలో ఆమె ముఖంలో కనిపించిన ఆనందం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్లు "థాంక్యూ ఫర్ ద గిఫ్ట్" (ఈ కానుకకు ధన్యవాదాలు) అంటూ ఆమే క్యాప్షన్ జత చేశారు. సరిగ్గా అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందు జరిగిన ఈ తేలికపాటి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారింది. "ఇక దీనిపై వచ్చే మీమ్స్ ఆపడం ఎవరి తరం కాదు". "అసలైన ‘మెలోడి చాక్లెట్ దొరికేసింది", "అంతర్జాతీయ దౌత్యంలో ఇదొక స్వీట్ మూమెంట్" అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. గతంలో జీ7 సదస్సులో వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీలు, చేసిన వీడియోలు సృష్టించిన సంచలనం తరహాలోనే. ఈ 'మెలోడి చాక్లెట్' ఉదంతం కూడా ఇప్పుడు ఇరు దేశాల ప్రజల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.






