- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: అక్రమ వలసదారులపై మోడీ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అమెరికా పర్యటనలో (US Tour) ఉన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అమెరికా పర్యటనలో (US Tour) ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో పలు కీలక భేటీల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడి అక్రమ వలసదారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని వెల్లడించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని అన్నారు. యువత, పేదరికంలో ఉన్నవారు వలసదారులుగా (Illegal Migrants) మారుతున్నారని మోడీ చెప్పారు. డబ్బు, ఉద్యోగాల పేరుతో కొంతమంది వారిని మోసం చేయటంతో వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని తెలిపారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాలని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. కాగా, అమెరికాలో (USA) అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ ట్రంప్‌తో భేటీ అయిన మోడీ వలసదారుల అంశంపైనా చర్చించారు.






