- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగా లేమని తాము శాంతిపక్షాన ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పష్టం చేశారు. ఇవాళ పుతిన్‍తో సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని (Russia–Ukraine war) ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలపై కీలక సంతకాలు జరిగాయని.. ‘పుతిన్ నేతృత్వంలో భారత్-రష్యాల సంబంధాలు (India–Russia relations) మరింత బలోపేతం అయ్యాయన్నారు. గత ఎనిమిది దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. భారత్‍కు రష్యా చిరకాల మిత్రదేశం రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. భారత్-రష్యాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందన్నారు. 2030 వరకూ ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయని ఆర్థిక రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరో స్థాయికి తీసుకువెళ్తామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్, రష్యా కలిసి నడుస్తున్నాయని స్పష్టం చేశారు. గతేడాది రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్ లో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమేనని పహెల్గాం ఉగ్రదాడిని రష్యా ఖండించిందని మోడీ గుర్తు చేశారు. భారత్, రష్యా, యూఎన్, జీ20, బ్రిక్స్ వేదికలు సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయని ఈ వేదికలన్నిటింలో ఉగ్రవాదానికి వ్యరేకంగా సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. గౌరవం, విశ్వాసంతో ఇరు దేశాల మధ్య బంధం కొనసాగుతుందన్నారు. రష్యా నుంచి భారత్ కు వచ్చే పర్యాటకులకు వీసాలో వెసులుబాటు కల్పిస్తున్నట్టు మోడీ చెప్పారు. ఇరు దేశాల క్రీడాకారులు, విద్యార్థుల మధ్య పరస్పర సహకారం అందించుకుంటామన్నారు.
Next Story






