- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొటోకాల్ పక్కనబెట్టి పుతిన్‌కు మోడీ స్వాగతం
ప్రొటోకాల్ పక్కనబెట్టి పుతిన్‌కు మోడీ స్వాగతం

దిశ, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) భారత పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీ సమీపంలోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్వయంగా స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి మరీ పుతిన్‌కు మోడీ స్వాగతం పలకడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రావడం ఇదే మొదటిసారి. ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా మోడీతో సమావేశం కానున్నారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశం పైనా చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. భారత్‌తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని పుతిన్ ఇప్పటికే పేర్కొన్నారు. వీడియో






