- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: భారత దేశ ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం
‘నరేంద్ర మోడీ అనే నేను’ అంటూ మూడోసారి భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ

X
దిశ, వెబ్‌డెస్క్: ‘నరేంద్ర మోడీ అనే నేను’ అంటూ మూడోసారి భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు మరో 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలతో పాటు దేశానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేశారు. గతంలో నెహ్రూ వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
Next Story






