మణిపూర్ మారణహోమం తరవాత రెండేళ్లకు ఆ రాష్ట్రానికి మోడీ!

by Ajay Maddhiboyina |

మణిపూర్‌ (MANIPUR)లో అల్లర్లు చెలరేగిన రెండేళ్ల త‌ర‌వాత‌ ప్రధాని మోడీ ( MODI) మొదటిసారి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు. మోడీ ప‌ర్య‌ట‌న‌ను మ‌ణిపూర్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పునీత్ కుమార్ గోయెల్ ధృవీక‌రించారు.

మణిపూర్ మారణహోమం తరవాత రెండేళ్లకు ఆ రాష్ట్రానికి మోడీ!
X

దిశ‌, వెబ్ డెస్క్: మణిపూర్‌ (MANIPUR)లో అల్లర్లు చెలరేగిన రెండేళ్ల త‌ర‌వాత‌ ప్రధాని మోడీ ( MODI) మొదటిసారి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు. మోడీ ప‌ర్య‌ట‌న‌ను మ‌ణిపూర్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పునీత్ కుమార్ గోయెల్ ధృవీక‌రించారు. శ‌నివారం మోడీ మిజోరంలోని ఐజ్వాల్ నుండి మ‌ధ్యాహ్నం చుర‌చంద్ పూర్ జిల్లాకు చేరుకుంటారు. అక్క‌డ మైతీ, కుకీ తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వ‌ల్ల నిరాశ్రాయులైన ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని వారితో మాట్లాడ‌తారు. అనంత‌రం రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేస్తారు.

అనంత‌రం పీస్ గ్రౌండ్ లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భలో ప్ర‌సంగిస్తారు. అదే విధంగా మ‌ధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మోడీ రాష్ట్ర రాజ‌ధాని ఇంఫాల్ వెళ్లి రూ.12,00 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌ను ప్రారంభించి మ‌రో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే మ‌ణిపూర్‌లో 2023లో రిజర్వేష‌న్ల‌కు సంబంధించిన మార్పుల విష‌యంలో మ‌ణిపూర్లో కుకీ, మైతీ అనే రెండు తెగ‌ల మ‌ధ్య హింస చెల‌రేగింది.

అది కాస్తా తీవ్ర‌స్థాయికి చేర‌డంతో ఒక‌రినొక‌రు చంపుకోవ‌డం, నిరంత‌ర దాడులు చేసుకోవడం వ‌ర‌కు దారి తీసింది. మహిళలను నగ్నంగా రోడ్డుపై నడించడం, అత్యాచారాలు చేయడం లాంటి దారుణాలు సైతం చోటు చేసుకున్నాయి. దాదాపు ఈ అల్లర్లలో 200 మంది మరణించారు. ఆ సమయంలో ప్రధాని మణిపూర్‌ను సందర్శించకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌ధాని మ‌ణిపూర్లో అడుగుపెట్ట‌లేదు. ఇక రెండేళ్ల త‌ర‌వాత ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు వెళుతుండ‌టంతో అక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి హామీలు ఇస్తారు, నిరాశ్ర‌యుల‌కు ఎలా భ‌రోసా క‌ల్పిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story