- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాల (Centenary celebrations)ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. అక్టోబర్ 1 ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకులకు ముఖ్య అతిథి (Chief Guest)గా భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) హాజరుకానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన స్మారక తపాలా స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నారు. అంతేకాక సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఇప్పటికే మన్‌కి బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, RSS శతాబ్ది ప్రయాణాన్ని “అద్భుతం, అపూర్వం, ప్రేరణాత్మకం”గా అభివర్ణించిన విషయం తెలిసిందే. కాగా ఈ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను1925లో నాగపూర్‌లో డా. కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ స్థాపించారు. ఈ సంస్థ దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, జాతీయ పునర్నిర్మాణం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తుంది. గత శతాబ్ద కాలంగా విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, విపత్తు సహాయక కార్యక్రమాల్లో RSS ముఖ్యపాత్ర పోషించింది. వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి విపత్తుల సమయంలో స్వయంసేవకులు సహాయ చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు.






