- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Modi: ఇంట్లో సిందూర మొక్కను నాటిన మోడీ..దాని ప్రత్యేకత ఏంటంటే?
పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సిందూర్ మొక్కను నాటారు. స్వయంగా మట్టి తీసి మోడీ ఈ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు.

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సిందూర్ మొక్కను నాటారు. స్వయంగా మట్టి తీసి మోడీ ఈ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు.అనంతరం దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ తన పోస్ట్‌కు మోడీ క్యాప్షన్ ఇచ్చారు. రెండో దశ కార్యక్రమంలో భాగంగా 10వేల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇక ఈ మొక్కను ప్రధాని గుజరాత్ పర్యటనలో ఉన్న సమయంలో 1971 ఇండో పాకిస్థాన్ యుద్ధంలో పోరాడిన మహిళలు బహూకరించారు.
ఆ మొక్కను తన నివాసంలోనే నాటుతానని ప్రధాని వారికి మాట ఇవ్వగా నేడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇక ఈ వార్త వైరల్ అవ్వడంతో సిందూర్ మొక్క పత్యేకత ఏంటి అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. సాధారణంగా ఈ మొక్క ద్వారా వచ్చే నారింజ రంగును గిరిజనులు సౌందర్య సాధానంగా ఉపయోగిస్తారు. దీనితోనే భారతీయ మహిళలు నుదిటిన పెట్టుకునే సిందూర్ తయారు చేస్తారు. అంతే కాకుండా భారతీయ ఆయుర్వేదంలోనూ దీనిని ఉపయోగిస్తారు. తలనొప్పి, కఫం, అధిక జ్వరం, గోనేరియా, రక్త వ్యాధులను నివారించడానికి దీనిని ఉపయోగిస్తారు.






