Modi: యూకే, మాల్దీవుల పర్యటనకు మోడీ.. చారిత్రాత్మక ఒప్పందానికి రెడీ !

by B.Srinivas |

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), మాల్దీవులు పర్యటనకు వెళ్లనున్నారు.

Modi: యూకే, మాల్దీవుల పర్యటనకు మోడీ.. చారిత్రాత్మక ఒప్పందానికి రెడీ !
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ (UK), మాల్దీవులు (Maldives) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కీలక వాణిజ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా పలువురు ప్రతినిధులతో భేటీ కానున్నారు. మోడీ మొదటగా 23, 24 తేదీల్లో యూకేలో పర్యటిస్తారు. అక్కడ ఆయన చారిత్రాత్మకమైన యూకే, ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) పై సంతకం చేయనున్నారు. ఈ అగ్రిమెంట్ సుంకాలను తగ్గించడం ద్వారా బ్రిటన్‌కు భారత్ చేసే ఎగుమతుల్లో 99 శాతం ప్రభావం చూపనుంది. దీంతో భారత్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని, విస్కీ, కార్ల వంటి బ్రిటన్ ఎగుమతులను సులభతరం చేస్తుందని పలువురు భావిస్తున్నారు.

యూకే టూర్ అనంతరం 25, 26 తేదీల్లో మాల్దీవులను సందర్శిస్తారు. ఆ దేశ 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (Mohammad muizzu) బాధ్యతలు చేపట్టాక మోడీ మాల్దీవులను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం, ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానాల నేపథ్యంలో మోడీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

Next Story