Modi: మాల్దీవుల ఉపాధ్యక్షుడితో మోడీ భేటీ.. కీలక అంశాలపై చర్చ

by B.Srinivas |

మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శనివారం ఆ దేశ 60వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Modi: మాల్దీవుల ఉపాధ్యక్షుడితో మోడీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల (Maldives) పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శనివారం ఆ దేశ 60వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజధాని మాలేలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని మాల్దీవుల ఇండిపెండెన్స్ డే వేడుకలకు అటెండ్ కావడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత మోడీ ఈ వేడుకలకు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇది ఎంతో దోహదపడుతుందని భావిస్తు్న్నారు.

స్వాత్రంత్ర వేడుకల అనంతరం మోడీ ఆ దేశ ఉపాధ్యక్షుడు ఉజ్ హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్ (Mohammad latheef), స్పీకర్ అబ్దుల్ రహీమ్ అబ్దుల్లా సహా పలువురు ప్రముఖ నాయకులతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, వాతావరణ మార్పు, మౌలిక సదుపాయాలు టెక్నాలజీ వంటి అంశాలపై చర్చించారు. ‘మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వాతావరణ మార్పు, ఇంధనం వంటి రంగాలలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉన్నాయి. ఇది మన ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని మేము ఎదురుచూస్తున్నాం’ అని మోడీ వివిధ నాయకులతో సమావేశం అనంతరం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Next Story