- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026 ముగిసే నాటికి ప్రధానిగా మోడీ ఉండరు: కేజ్రీవాల్
2026 చివరి నాటికి మోడీ ప్రధానమంత్రి పదవిలో ఉండకపోవచ్చు అని జోష్యం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడిన తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని విలన్ చేసే దిశగా స్కెచ్ లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు.
2026 చివరి నాటికి మోడీ ప్రధానమంత్రి పదవిలో ఉండకపోవచ్చు అని జోష్యం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. తనకున్న రాజకీయ అవగాహనతో ఈ విషయాన్ని చెబుతున్నానని వివరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సైతం కాలం చెల్లిపోయింది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళ పాలన ఇక నడవబోదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మరి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.






