గోవా జీ-20 సమావేశాలు.. అమెరికా నుంచి మోడీ కీలక సందేశం

by Seetharam |

గోవాలో జరుగుతున్న జీ-20 సమావేశాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు.

గోవా జీ-20 సమావేశాలు.. అమెరికా నుంచి మోడీ కీలక సందేశం
X

దిశ,వెబ్‌డెస్క్: గోవాలో జరుగుతున్న జీ-20 సమావేశాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ, అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు అందరినీ స్వాగతిస్తున్నామని మోడీ అన్నారు. గోవాలోని సహజ సౌందర్యాన్ని, ఆధ్యాత్మికతను అన్వేషించడానికి చర్చల నుంచి కొంత సమయం కేటాయించమని కోరారు. గత తొమ్మిదేళ్లలో దేశంలోని మొత్తం పర్యాటక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మునుపటితో పోల్చుకుంటే యాత్రికుల సంఖ్య పది రెట్లు పెరిగిందన్నారు.

Next Story