Rahul Gandhi : ఫేక్ హామీల్లో మోడీ, కేజ్రీవాల్‌ సేమ్ టు సేమ్.. : రాహుల్ గాంధీ

by Sathputhe Rajesh |

ప్రధాని మోడీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌‌కు ఫేక్ హామీలు ఇవ్వడంలో తేడా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

Rahul Gandhi : ఫేక్ హామీల్లో మోడీ, కేజ్రీవాల్‌ సేమ్ టు సేమ్.. : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌‌కు ఫేక్ హామీలు ఇవ్వడంలో తేడా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీలంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సోమవారం ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కావాలా.. కుల గణన కావాలా అని కేజ్రీవాల్‌ను అడగండి. కుల గణన గురించి నేను మాట్లాడినప్పుడు.. మోడీ, కేజ్రీవాల్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అబద్ధపు హామీలు ఇవ్వడంలో ఇద్దరికి ఎలాంటి తేడా లేదు. వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు తమ హక్కులను పొందాలని మోడీ, కేజ్రీవాల్‌ కోరుకోవడం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రిజర్వేషన్ పరిమితిని పెంచుతామన్నారు. కేజ్రీవాల్ ఏనాడైనా అదానీ గురించి మాట్లాడారా..? పేదలు, మైనార్టీలకు సమానత్వాన్ని మేము కోరుకుంటున్నాం. దేశాన్ని ఒక వ్యాపార వేత్త నడపడాన్ని అంగీకరించేది లేదు.’ అని రాహుల్ అన్నారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీని ప్యారిస్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో అవినీతి రాజ్యమేలుతోంది. తాము అధికారంలోకి వస్తే అవినీతిని అంతం చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షకులకు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకునే వారికి మధ్య దేశంలో యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు.

పార్టీని కాపాడేందుకే రాహుల్ పోరాటం.. : కేజ్రీవాల్

రాహుల్ వ్యాఖ్యలపై ‘ఎక్స్’ వేదికగా కేజ్రీవాల్ స్పందించారు. ‘రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీకి వచ్చారు. తనపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యలపై నేను స్పందించను.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు పోరాడుతున్నారు. నేను దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాను.’ అని ఆప్ చీఫ్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా.. 8న ఫలితాలను వెల్లడించనున్నారు.

Next Story