మోడీ 'ఇన్‌ఫ్లేషన్ మ్యాన్'.. పెట్రోల్ ధరల పెంపుపై రాహుల్ గాంధీ ఫైర్

by Prasad Jukanti |

శవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ధరల పెంపుపై ప్రధాని మోడీని 'ఇన్‌ఫ్లేషన్ మ్యాన్' అంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

మోడీ  ఇన్‌ఫ్లేషన్ మ్యాన్.. పెట్రోల్ ధరల పెంపుపై రాహుల్ గాంధీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరోసారి భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం పట్ల లోక్‍సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ టాల్ లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఇన్‌ఫ్లేషన్ మ్యాన్ అని ఆయన మరోసాతి తన ప్రతాపం చూపించారంటూ మండిపడ్డారు. తమ జేబులను గుల్లచేస్తున్నారనే విషయం ప్రజలు గుర్తించకుండా ఉండేలా పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచుతున్నారని ఆరోపించారు. దేశంపై ఆర్థిక తుఫాను రాబోతోందని నేను నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నానని కానీ మోడీ మాత్రం ఎప్పటిలాగే ఎన్నికలతో బిజీగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను రూ.8 మేర పెంచేశారని మండిపడ్డారు.ఈ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగబోదని ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, మిగతా సమయంలో ప్రజల జేబులపై దాడి చేయడం ఇన్‌ఫ్లేషన్ మ్యాన్ మోడీకి ఇదొక్కటే తెలుసని మండిపడ్డారు.

115కు చేరిన లీటర్ పెట్రోల్ ధర:

అందరూ ఊహించినట్లే పెట్రోల్ ధరలు వరుస షాకులు ఇస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచిన చమురు సంస్థలు ఇవాళ మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ. 2.84, అటు డీజిల్ పై రూ. 2.86 చొప్పున ధరలను పెంచాయి. పెరిగిన ధరల నేపథ్యంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19 కాగా డీజిల్ రేటు రూ.104.88కి చేరుకుంది. హైద‌రాబాద్‍లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.68కు చేర‌నుండ‌గా, డీజిల్ రేటు రూ.103.74కు చేరుకుంటుంది.

Next Story