- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో.. జాతికి అంకితం చేసిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మీరట్ మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మీరట్ మెట్రో(Meerut Metro)ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎస్పీ పాలనలో అన్నీ స్కాములే అని విమర్శించారు. యోగి పాలనలోనే యూపీ అభివృద్ధి సాధ్యమన్నారు. ఇక, 120 కి.మీ. వేగంతో నడిచే మీరట్ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన వ్యవస్థగా అవతరించింది. ఈ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 55 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ మెట్రోతో పాటు నమో భారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని సారాయ్ కలే ఖాన్ నుంచి యూపీలోని మోదీపురం వరకు మొత్తం 82.15 కి.మీ. పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ నమో భారత్ కారిడార్ దేశంలోనే తొలి రీజినల్ ర్యాపిడ్ రవాణా వ్యవస్థ. అన్ని స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ డోర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో మహిళలు, సీనియర్ సిటిజన్లకు రిజర్వు చేసిన సీటింగ్ ఉంటుంది. వీల్‌చైర్లు, మెడికల్ స్ట్రెచర్‌లకు స్థలం, విశాలమైన లిఫ్ట్‌ల ప్రతి స్టేషన్‌లోనూ ఉన్నాయి. పూర్తిగా ఈ కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ- మీరట్ మధ్య ప్రయాణానికి 55 నిమిషాలు పడుతుందని అంచనా వేశారు.






