Kharge: మోడీ ప్రభుత్వానికి అంబేద్కర్‌పై గౌరవం మాటల్లోనే: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

by S Gopi |

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్‌కు శత్రువులు అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Kharge: మోడీ ప్రభుత్వానికి అంబేద్కర్‌పై గౌరవం మాటల్లోనే: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ప్రభుత్వం బీఆర్ అంబేద్కర్‌కు మాటల్లో మాత్రమే గౌరవం ఇస్తోంది, కానీ ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఏమీ చేయలేదు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్‌కు శత్రువులు అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఖర్గె.. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలకు బదులిచ్చారు. 1952 ఎన్నికలలో తన ఓటమికి ఎస్ఏ డాంగే, వీడీ సావర్కర్ కారణమని అంబేద్కర్ రాసిన లేఖను గుర్తుచేశారు. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా కుల గణనతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించే హక్కు రాజ్యాంగం అంబేద్కర్‌ ఇచ్చిన బహుమతి అని అన్నారు. ఇందులో భాగంగానే సామాజిక న్యాయంపై ఏఐసీసీ సెషన్‌లో చర్చిస్తున్నట్టు చెప్పారు.

కేంద్రం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన విధానాలు రూపొందిస్తోంది. 2021 జనాభా లెక్కల గురించి కనీస ప్రస్తావన లేదు. సాధారణ జనాభా గణనతో పాటు కుల గణన కూడా నిర్వహించి ఏ విభాగం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కానీ, కుల గణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఖర్గె విమర్శించారు.

Next Story