నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. స్పందించిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. స్పందించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో అంతులేని అవినీతి, సోషల్ మీడియా బ్యాన్ తో ఒక్కసారిగా నిరసనలు చెలరేగాయి. వేలాది మంది యువత రోడ్లపైకి రావడంతో నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు, మంత్రులకు తమ పదవులకు రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జెన్ Z ఉద్యమకారులో సైన్యంతో చర్చించి.. తమకు నేపాల్ ప్రధానిగా సుశీల కర్కి అయితే ఒకేనని తెలిపారు. దీంతో శుక్రవారం ఆమె నేపాల్ తాత్కాలిక ప్రధాని (Acting Prime Minister of Nepal)గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆమెకు స్థానిక దేశాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.

ఆయన తన ట్వీట్‌లో "నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ (Provisional Government of Nepal) ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులైన సుశీలా కర్కి (Sushila Karki)కి హృదయపూర్వక అభినందనలు. నేపాల్ సోదరసోదరీమణుల శాంతి, పురోగతి, శ్రేయస్సుకు భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది." అని ప్రధాని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే నిన్న ఉదయం వరకు అల్లర్లతో అట్టుడికిపోయిన నేపాల్ సాయంత్రానికి పూర్తి ప్రశాంతంగా మారిపోయింది. ఈ రోజు పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడగా.. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు.

Next Story