ఏఆర్ రెహమాన్ పై మోడీ ప్రశంసలు.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రెహమాన్ పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ పై మోడీ ప్రశంసలు.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రెహమాన్ పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పిల్లలు అమీన్, రహీమా సోషల్ మీడియాలో తండ్రికి మద్దతు తెలిపారు. ఇత‌రుల‌ను నిందించ‌డానికి స‌మ‌యం కేటాయించే వాళ్లు ప్రేమ‌ను బోధించే గ్రంథాల‌ను చ‌ద‌వ‌లేక‌పోతున్నార‌ని ర‌హీమా పేర్కొన్నారు. అంతేకాకుండా రెహమాన్ మ్యూజిక్ పై, రాజమౌళిపై మోడీ ఓ ఈవెంట్ లో ప్రశంసలు కురిపించగా ఆ వీడియోను షేర్ చేశారు. వీడియోలో మోడీ.. రాజమౌళి, రెహమాన్ భారతీయ సంస్కృతిని ప్ర‌పంచానికి చాటుతున్నార‌ని అన్నారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు సైతం రెహ‌మాన్ కు మ‌ద్ద‌తిస్తున్నారు. ఇదిలా ఉంటే రెహ‌మాన్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో 8ఏళ్లుగా వివక్షను ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించారు. తనకు రావాల్సిన ప్రాజెక్టులు వేరేవాళ్లకు కట్టబెడుతున్నారని దీని వెనుక మతపరమైన కోణం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తనతో నేరుగా చెప్పకపోయినా వినిపించే మాటలను బట్టి అర్థం చేసుకున్నానని అన్నారు. దీంతో రెహమాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా తిరిగి ఆయన వివరణ ఇచ్చారు.

Next Story