- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిబ్రవరి 13న మోడీ, ట్రంప్ భేటీ?
గత వారం ప్రధాని మోడీకి అధ్యక్షుడు ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. అప్పటి నుంచి మోడీ అమెరికా పర్యటనపై ఊహాగానాలు వస్తున్నాయి.

- ఫ్రాన్స్ నుంచి నేరుగా అమెరికాకు
- ఫిబ్రవరి 14 వరకు యూఎస్ కాపిటల్‌లో మోడీ
దిశ, నేషనల్ బ్యూరో:
ప్రధాని మోడీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ నెల 13న వాషింగ్టన్‌లో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా పర్యటనలో మోడీ కోసం ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేస్తారని, అక్కడే ఇద్దరి మధ్య సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్న మోడీ.. అటునుంచి అటే ఫిబ్రవరి 12న అమెరికా చేరుకుంటారు. ఫిబ్రవరి 14 వరకు యూఎస్ రాజధానిలోనే ఉంటారని తెలిసింది. అమెరికా పర్యటనలో అమెరికా కొర్పొరేట్ దిగ్గజాలతో పాటు ఎన్ఆర్ఐలను కూడా కలుస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత వారం ప్రధాని మోడీకి అధ్యక్షుడు ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. అప్పటి నుంచి మోడీ అమెరికా పర్యటనపై ఊహాగానాలు వస్తున్నాయి. ఇరు దేశాల నాయకుల మధ్య వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉండటంతో త్వరలోనే సమావేశమవుతారనే వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో మోడీ పర్యటన దాదాపు ఖరారయ్యిందని, ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో తోడ్పడుతుందని అధికార వర్గాలు చెప్పాయి. అమెరికాకు చెందిన రక్షణ పరికరాలను ఇండియాకు అమ్మే విషయంలో న్యాయమైన వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తామని ట్రంప్ చెప్పారు. కెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్‌లు విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇండియాను మాత్రం ఆ లిస్టు నుంచి తప్పించింది.






