అహ్మదాబాద్‌ ఫ్లవర్ షోకు గిన్నిస్ రికార్డులు.. ప్రధాని మోడీ ప్రశంసలు

by Ajay Maddhiboyina |

అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో 14వ అహ్మ‌దాబాద్ అంత‌ర్జాతీయ పూల ప్ర‌ద‌ర్శ‌న నిర్మించారు. స‌బ‌ర్మ‌తి న‌ది తీరంలో సీఎం భూపేంద్ర ప‌టేల్ ఈ పూల ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు.

అహ్మదాబాద్‌ ఫ్లవర్ షోకు గిన్నిస్ రికార్డులు.. ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో 14వ అహ్మ‌దాబాద్ అంత‌ర్జాతీయ పూల ప్ర‌ద‌ర్శ‌న నిర్మించారు. స‌బ‌ర్మ‌తి న‌ది తీరంలో సీఎం భూపేంద్ర ప‌టేల్ ఈ పూల ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. భార‌త్ ఏక్ గాథ థీమ్ తో ఈ పూల ప్రదర్శన ఏర్పాటు చేయగా అద్భుదమైన ప్రదర్శనకు గాను రెండు గిన్నిస్ రికార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. అహ్మ‌దాబాద్ ఫ్ల‌వ‌ర్ షో అంద‌రినీ మంత్రముగ్ధుల‌ను చేస్తుంద‌న్నారు. ఇది సృజ‌నాత్మ‌క‌త‌కు మ‌రియు ప్ర‌జ‌ల భాగస్వామ్యానికి అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. దీని ద్వారా న‌గ‌రం ఉత్సాహ‌భ‌రిత‌మైన స్పూర్తితో పాటు ప్ర‌కృతితో ఆని సంబంధాన్ని అందంగా ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని కొనియాడారు. పుష్ప ప్ర‌ద‌ర్శ‌న గొప్ప‌త‌నం ప్ర‌తి ఏడాది ఎలా పెరుగుతుందో చూడ‌టం థ్రిల్లింగ్ గా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ పోస్ట్ లో ఫ్ల‌వ‌ర్ షోకు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను సైతం పంచుకున్నారు.

Next Story