- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dating Offer : మోడల్ డేటింగ్ ఆఫర్..వెల్లువెత్తిన దరఖాస్తులు!
ఓ యువ మోడల్ తన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో చేసిన ప్రయత్నం కుర్రకారులో అగ్గిపుట్టించింది. 27 ఏళ్ల మోడల్ డిజిక్‌మాన్స్(Model Digicmans ) డేటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఓ యువ మోడల్ తన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో చేసిన ప్రయత్నం కుర్రకారులో అగ్గిపుట్టించింది. 27 ఏళ్ల మోడల్ డిజిక్‌మాన్స్(Model Digicmans ) డేటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఓపెన్ ఆఫర్(Dating Offer) ఇచ్చింది. తాను డేటింగ్ చేయాలని భావిస్తున్నానని, దరఖాస్తు(Apply )చేసుకోవాలని యువకులకు పిలుపునిచ్చింది. అయితే తనతో డేటింగ్ చేసేందుకు కొన్ని కఠినమైన షరతులు వర్తిస్తాయని తెలిపింది. అందమైన యువతి ప్రకటించిన డేటింగ్ ఆఫర్ పట్ల కుర్రకారు సోల్లు కార్చుకోకుండా ఉండలేరు కదా.
మోడల్ డిజిక్ మాన్స్ అందానికి ఫిదా అయిన కుర్రకారు ఆమె షరతులకు ఏ మాత్రం వెరవకుండా ఆమెతో డేటింగ్ చేసేందుకు వేలం వెర్రిగా దరఖాస్తులతో పోటెత్తారు. ఏకంగా 5000 మందికి పైగా యువకులు డిజిక్ మాన్స్ తే డేటింగ్ చేసేందుకు దరఖాస్తు చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనతో డేటింగ్ కు వేల సంఖ్యలో యువకులు దరఖాస్తులు చేసుకున్నప్పటికి వారిలో కేవలం ముగ్గురు మాత్రమే తన షరతులకు అనుగుణంగా ఉన్నారని మోడల్ డిజిక్ మాన్స్ తెలిపింది. అంతే కాదండోయ్..ప్రస్తుతం తాను బాయ్ ఫ్రెండ్ కోసం చేసే ప్రయత్నాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకేముంది ఆమెతో డేటింగ్ ఆఫర్ దక్కతుందేమోనని ఆశలు పెట్టుకున్న యువకుల ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి.
తనతో డేటింగ్ కోసం వేల అప్లికేషన్స్ రావడం సంతోషంగా ఉందని డిజిక్‌మాన్స్ చెప్పింది. అయితే అంత మంది యువకులు తనతో డేటింగ్ చేయాలని అనుకోవడం తాను గొప్పతనంగా భావించడం లేదని..తనతో డేటింగ్ చేసే అర్హతలు ఉన్న వ్యక్తి ఇంకా కనిపించలేదని, అతని కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కోంది. ప్రస్తుతానికి డేటింగ్ పాట్నర్ వెతుకులాటను ఆపేస్తు్న్నానని ప్రకటించింది. వేల సంఖ్యలో తన కోసం డేటింగ్ దరఖాస్తులు వచ్చినా నచ్చిన భాగస్వామిని కనుగొనలేకపోయానని బాధపడింది. ఏదైమైనా ఈ భూమ్మీద తానే "మోస్ట్ వాటెండ్ గర్ల్ ఫ్రెండ్" అంటూ ఒయ్యారాలు పోయింది. కాగా డేటింగ్ కోసం వచ్చిన వేలమంది దరఖాస్తుదారుల్లో తనకు నచ్చిన ఒకరిని గుర్తించలేకపోయానన్న మోడల్ డిజిక్ మాన్స్ ప్రకటనపై యువత మండిపడుతున్నారు. ఆమె ప్రకటన చూస్తే పాపులారిటీ కోసం చేసిన ట్రిక్ గా కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు.






