Mock Drill: నేటి నుంచి దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహణ...అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి.. దేశ పౌరులు ఏం చేయాలి..?

by Vennela |

Mock Drill: ఆపరేషన్ సింధూర్ పేరిట భారతదేశం పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేసింది.

Mock Drill: నేటి నుంచి దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహణ...అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి.. దేశ పౌరులు ఏం చేయాలి..?
X

దిశ, వెబ్ డెస్క్: Mock Drill: ఆపరేషన్ సింధూర్ పేరిట భారతదేశం పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య దాదాపు యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను అప్రమత్తం చేసేందుకు నేటి నుంచి దేశవ్యాప్తంగా మాకు డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు మాక్ డ్రిల్ అంటే ఏమిటి దేశవ్యాప్తంగా ఇది ఎందుకు నిర్వహిస్తున్నారు. వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యుద్ధం అనేది జరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి. ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల పైన కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది దీనినే మాక్ డ్రిల్ అంటారు. ఇందులో భాగంగా శత్రుదేశాల వారు దాడి చేసినప్పుడు అత్యవసర పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. తమను తాము ఎలా కాపాడుకోవాలి, దాడిలో గాయపడ్డ వారిని ఆస్పత్రులకు ఎలా చేర్చాలి. ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి. వాటి విషయాలను ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయనున్నారు. ముఖ్యంగా వైమానిక దాడులు జరిగినప్పుడు ఎలాంటి హెచ్చరికలు వస్తాయి. వంటి విషయాల పైన కూడా అవగాహన కల్పించనున్నారు.

మాక్ డ్రిల్ అనేది పౌర రక్షణ కోసం జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నిర్వహించనున్నారు.అందులో ఉండే కార్యకలాపాలు ఇవే..

1. ఎయిర్ అటాక్ జరిగినప్పుడు సైరన్ ప్రయోగం:

విమాన దాడుల సమయంలో ప్రజలకు హెచ్చరికగా వినిపించే సైరన్‌ పనితీరును ఈ మాక్ డ్రిల్ లో భాగంగా పరీక్షిస్తారు.

2. బ్లాక్ అవుట్ (విద్యుత్ నిలిపివేత) అభ్యాసం:

యుద్ధ పరిస్థితులకు తగ్గట్టుగా విద్యుత్ నిలిపివేస్తారు. ఎందుకంటే వైమానిక దాడులు జరిగినప్పుడు భూమిపై వెలుతురు లేకుండా ఉండే పరిస్థితులు కల్పిస్తారు. ప్రజలు వీటిని ఎదుర్కొనేందుకు అవగాహన కల్పిస్తారు. .

3. బంకర్ తనిఖీలు:

అందుబాటులోని భూగర్భ గృహాలు(బంకర్లు) శుభ్రపరిచి, వాటిని వినియోగించేందుకు సిద్ధంగా ఉంచుతారు. .

4. జనాభా తరలింపు డ్రిల్:

దాడుల ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అభ్యాసం చేస్తారు.

5. కమ్యూనికేషన్ సిస్టం పరీక్షలు:

భారత వాయుసేనతో హాట్‌లైన్‌లు, రేడియో లింకులు పనిచేస్తున్నాయా లేదా అని పరీక్షించుకుంటుంది. .

6. పౌరులకు యుద్ధ పరిస్థితులపై అవగాహన:

స్వచ్ఛంద సంస్థలకు చెందిన సేవకులు, విద్యార్థులు, హోమ్ గార్డులకు ప్రాథమిక చికిత్స, అగ్నిప్రమాద నివారణ పద్ధతులు, ఎమర్జన్సీ సర్వీసుల నిర్వహణ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు.

ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో కొన్ని జాగ్రత్తలు పేర్కొంటూ ఒక మెసేజ్ ఎక్కువగా ప్రాచూర్యం పొందింది. అందులో వివరాలు ఇలా ఉన్నాయి.

>> ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక నెల ఖర్చులకు సరిపడా నగదు ఇంట్లో ఉంచుకోమని సలహా ఇస్తున్నారు ముఖ్యంగా ఏటీఎంలు, యూపీఐ, క్రెడిట్ కార్డులు పనిచేయకపోవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.

>> కనీసం 25 రోజులకు సరిపడా ఆహారం అదేవిధంగా బ్రెడ్ రేషన్ ఇంట్లో నిల్వ ఉంచుకోవాాల్సిందిగా సూచించారు.

>> టార్చ్ లైట్, అదనపు బ్యాటరీలు సిద్ధంగా ఉంచుకోమని సలహా ఇచ్చారు.

>> ప్రభుత్వ ప్రకటనలు వినేందుకు బ్యాటరీతో పనిచేసే రేడియో ఉండాలని చెబుతున్నారు.

>> ఫోన్లతో పాటు పవర్ బ్యాంకులు పూర్తిగా చార్జ్ చేసి ఉంచుకోమని సలహా ఇస్తున్నారు.

>> తగినంత తాగు నీరు నిల్వ ఉంచండి

>> ఇంట్లో ఒక సురక్షిత గది గుర్తించండి కిటికీలు, తలుపులు లేని ప్రాంతంలో ఉండాలి

>> దాడి జరుగుతున్నప్పుడు నేలపై పడుకొని, చేతులతో చెవులు మూసుకోవాలని సూచించారు.

Next Story