కేదార్‌నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం.. రీల్స్, ఫోటోలు తీస్తే కఠిన చర్యలు

by Malleboina Mahesh |

కేదార్‌నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లను కమిటీ నిషేధించింది. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు లేదా రీల్స్ తీయడం నిషిద్ధం.

కేదార్‌నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం.. రీల్స్, ఫోటోలు తీస్తే కఠిన చర్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) ఒకటి. హిమాలయాల్లో ఉన్న ఈ కేదారేశ్వరుడుని దర్శించుకోవడానికి దేశంలోని నలుమూలల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా భక్తులు, టూరిస్టులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం నిర్ణత కాలం పాటు ఓపెన్ లో ఉండే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఎన్నో అడ్వేంచర్లు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికి భక్తులు ఇక్కడికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులకు, టూరిస్టులకు ఈ రోజు నుంచి అనుమతించారు. అలాగే ఆలయంలోని ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని ఆలయ కమిటీ (Temple Committee) పూర్తిగా నిషేధించింది. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు, భక్తుల దర్శనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు వినీత్ పోస్తి వెల్లడించారు.

ఆలయ లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం, సోషల్ మీడియా కోసం రీల్స్ రికార్డ్ చేయడం ఖచ్చితంగా నిషిద్ధం. ఈ నిబంధనలను అతిక్రమించి వీడియోలు, ఫోటోలు తీసే భక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, జరిమానా కూడా విధించే అవకాశం ఉందని కమిటీ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఆలయ ప్రాంగణంలో కొందరు భక్తులు రీల్స్ చేస్తూ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భక్తులు ఈ నిబంధనలను పాటించి ఆలయ పర్యావరణాన్ని గౌరవించాలని అధికారులు కోరుతున్నారు.

Next Story