సీఎంను పొగిడిన ఎమ్మెల్యే.. వెంటనే సస్పెండ్

by Muthe.Rajitha |

సీఎంను పొగిడితే మంత్రి పదవి రావాలి గాని, రివర్స్ లో ఎమ్మెల్యే సస్పెండ్ అయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

సీఎంను పొగిడిన ఎమ్మెల్యే.. వెంటనే సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎంను పొగిడితే మంత్రి పదవి రావాలి గాని, రివర్స్ లో ఎమ్మెల్యే సస్పెండ్ అయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ ప్రశంసించింది. నేడు యూపీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. నా భర్తను చంపిన అఠీక్ అహ్మద్ లాంటి క్రిమినల్స్ మీద సీఎం యోగి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. మహిళలుం కోల్పోయిన మంగళసూత్రాలకు వెంటనే న్యాయం జరిగేలా సీఎం చేస్తున్నారన్నారు. నేరాలను అరికట్టడంలో, గ్యాంగ్ స్టర్స్ ను అంతమొందించడంలో రాష్ట్రం అంతా యోగి వైపు చూస్తోందని పేర్కొన్నారు.

ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు అని కొనియాడారు. కాగా దీనిపై ఆగ్రహించిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. గంటల వ్యవధిలోనే పూజపై చర్యలకు దిగారు. ఆమెను పార్టీ నియమాలను అతిక్రమించారని చెబుతూ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కాగా 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాల్ దారుణ హత్యకు గురయ్యారు. వివాహం జరిగిన 10 రోజులకే ప్రత్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అష్రాఫ్ అహ్మద్ ఆయన సోదరుడు అతీక్ కలిసి ఘోరంగా చంపేశారు.

అనంతరం అఫ్రాఫ్, అతీక్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎదిగారు. కాగా 2023లో ఓ కేసు విచారణలో వైద్య పరీక్షలకు వెళ్తుండగా, జర్నలిస్టుగా వచ్చిన నలుగురు వారి ఇద్దరినీ కాల్చి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Next Story